ఒడిశా తీరాన మోదీ శైకత శిల్పం
తయారు చేసిన సుదర్శన్ పట్నాయక్
ఒడిశా – ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్ గా గుర్తింపు పొందిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలనంగా మారారు. సోమవారం ఆయన ఒడిశాలో పర్యటిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ఎత్తున ర్యాలీ, రోడ్ షో చేపట్టారు. అంతకు ముందు అత్యంత పేరు పొందిన దేవాలయం పూరీలో కొలువు తీరిన జగన్నాథుడి వద్దకు చేరుకున్నారు. పూజలు చేశారు. అనంతరం రోడ్ షో లో పర్యటించారు.
మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. నరంద్ర మోదీ పూరీ దేవాలయాన్ని సందర్శించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దనీని పురస్కరించుకుని ప్రముఖ ప్రపంచ శైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతంగా ఒడిశా నదీ తీరాన ఎంతో కష్టపడి మోదీ, పూరీ జగన్నాథుడిని మొక్కుతున్నట్లు శైకత శిల్పాన్ని తయారు చేశారు.
ఇందుకు సంబంధించి ట్విట్టర్ లో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. దీనిని ప్రత్యకంగా షేర్ చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీజీ. మీ అభిమానం , తయారు చేసిన శైకత శిల్పం తనను ఎంతగానో ఆకట్టుకునేలా చేసిందని తెలిపారు ప్రధాని.