మోదీకి ఓటమి తప్పదు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
ఉత్తర ప్రదేశ్ -ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గడ్డు కాలం నడుస్తోందని ఎద్దేవా చేశారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పదేళ్ల పాటు అబద్దాల పునాదుల మీద పాలన సాగిస్తూ వచ్చారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. కేవలం మాయ మాటలతో పాలనను నెట్టుకు వస్తున్నాడని, ఆయన వల్ల ఈ దేశానికి ఒరిగింది ఏమీ లేదన్నారు.
ఇప్పటి వరకు తన పాలనలో దేశం కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు ప్రియాంక గాంధీ. తన సోదరుడు బహిరంగంగానే చర్చకు రావాలని సవాల్ విసిరారని, కానీ ఇప్పటి వరకు ప్రధాన మంత్రి ఆ సవాల్ ను స్వీకరించ లేక పోయారని మండిపడ్డారు.
దీనిని బట్టి చూస్తే నరేంద్ర మోదీ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నట్టేనని ప్రకటించారు ప్రియాంక గాంధీ.