పీకే షాకింగ్ కామెంట్స్
ఆశించిన రీతిలో సీట్లు రావు
న్యూఢిల్లీ – భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ప్రముఖ జర్నలిస్ట్ బర్కా దత్ తో సంభాషించారు. ఈసారి ఎన్నికలపై కొంత అటు ఇటుగా ఫలితాలు ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
గతంలో కంటే ఈసారి ఎన్నికలు అంత ఆషా మాషీ వ్యవహారం కాదన్నారు. విచిత్రం ఏమిటంటే బీజేపీ అయోధ్యలోని రామాలయాన్ని ముందుకు తీసుకు వచ్చిందని కానీ వర్కవుట్ కాలేదన్నారు. అది ఎక్కువగా ప్రభావితం చూపించ లేదని పేర్కొన్నారు.
సగం మంది హిందువులు మూడీకి ఓటు వేయలేదని, ఈ విషయం గుర్తిస్తే మంచిదని స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్. వేయని వారంతా గాంధేయ వాదులు, అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు కూడా ఉన్నారని స్పష్టం చేశారు పీకే.
ప్రస్తుతం ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇది భారీ డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. మొత్తంగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.