ప్రజాస్వామ్యానికి పరీక్ష – రాహుల్
మోదీపై నిప్పులు చెరిగిన గాంధీ
ఉత్తర ప్రదేశ్ – దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఐదు విడతల పోలింగ్ ముగిసింది. ఇంకా రెండు విడతలు మిగిలి ఉన్నాయి. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో కంటే ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ 400 సీట్లు వస్తాయని ధీమాతో ఉండగా ఇండియా కూటమి అంత సీన్ లేదంటోంది.
ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం యూపీలోని రాయ్ బరేలి నుంచి బరిలోకి దిగారు. సోమవారం ఆయా పోలింగ్ బూత్ ల వద్దకు స్వయంగా వెళ్లారు. ఓటర్లతో సెల్ఫీలు కూడా దిగారు.
మోదీకి ఓటమి తప్పదన్నారు. బీజేపీ అబద్దపు పాలనకు అంతం పాడే సమయం వచ్చిందన్నారు రాహుల్ గాంధీ. వ్యవస్థలను సర్వ నాశనం చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు రాహుల్ గాంధీ. మొత్తంగా తమ కూటమికి విజయం వరించక తప్పదన్నారు.