బీజేపీ కీలక సమావేశం
హాజరైన పలువురు నేతలు
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ కీలక సమావేశం సోమవారం న్యూఢిల్లీ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షత వహించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ తో పాటు మరికొందరు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై చర్చించారు. పార్టీకి ఆయా దశల వారీగా జరిగిన విడతల పోలింగ్ లో ఏ మేరకు సీట్లు వస్తాయనే దానిపై ఎక్కువగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు దేశంలో 5 విడతల పోలింగ్ ముగిసింది.
ఇంకా రెండు విడతల పోలింగ్ మిలిగి ఉంది. మొత్తం 543 సీట్లకు గాను ఏడు విడతలుగా పోలింగ్ చేపట్టాలని ఈసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అన్ని చోట్లా బీజేపీ లీడ్ లో ఉందని సమాచారం. మొత్తంగా మరోసారి నరేంద్ర మోదీ సారథ్యంలో తిరిగి బీజేపీ ఎన్డీయే కూటమి పవర్ లోకి రానుందని ప్రకటించారు బండి సంజయ్ కుమార్.