రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ..?
ప్రకటించిన పోలీసులు
బెంగళూరు – దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది బెంగళూరు లో నిర్వహించిన రేవ్ పార్టీ కేసు. ఇందులో ప్రధానంగా రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నట్లు సమాచారం. అంతే కాకుండా అర్ధ నగ్న డ్యాన్సులతో పాటు భారీ ఎత్తున డ్రగ్స్ కూడా దొరికినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ప్రముఖ నటి హేమ కూడా పాల్గొన్నట్లు. అయితే ఆమె దానిని ఖండించారు. తనకు రేవ్ పార్టీతో సంబంధం లేదన్నారు. కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ప్రకటించారు.
అయితే నటి హేమ చేసిన వ్యాఖ్యలు తప్పని ఆమె రేవ్ పార్టీలో పాల్గొందని బెంగళూరు పోలీసులు సోమవారం నిర్ధారించారు. ఈ మేరకు ఈ కీలక విషయాన్ని బయట పెట్టారు. హేమ తాజాగా విడుదల చేసిన వీడియో కూడా బెంగళూరు ఫామ్ హౌస్ లో షూట్ చేసిందనేనని కుండ బద్దలు కొట్టారు.
దీంతో ఇప్పుడు నటి హేమ ఏం సమాధానం చెబుతుందనేది ఉత్కంఠగా ఉంది. ఇదిలా ఉండగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్లు టాక్. మనోడు జనసేన పార్టీ చీఫ్ పాటకు డ్యాన్సు కూడా చేశాడు.