భారత జట్టు ఎంపిక భేష్
మాజీ క్రికెటర్ సురేష్ రైనా
ఛత్తీస్ గఢ్ – ప్రముఖ మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఛత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో మీడియాతో మాట్లాడారు. వచ్చే జూన్ నెలలో ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్ కప్ అమెరికా, విండీస్ లలో ఐసీసీ నిర్వహించనుంది.
ఇందుకోసం ఇప్పటికే జట్లను ప్రకటించాయి. భారత జట్టు కూడా రెడీ అయ్యింది. ప్రస్తుతం ఎంపికైన ఆటగాళ్లు ఐపీఎల్ లో బిజీగా ఉన్నారు. కొత్తగా సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. ఇక ఎప్పటి లాగే అనుభవం కలిగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు సారథ్యం అప్పగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా మరింత అనుభవం కలిగిన ఆటగాడు కోహ్లీ ఉన్నాడని, ఏ సమయంలోనైనా దాడికి దిగే సూర్య కుమార్ యాదవ్ , ఇక ఎలాంటి పిచ్ పైన నైనా దంచి కొట్టే సంజూ శాంసన్ , రిషబ్ పంత్ లాంటి వాళ్లు ఆడడం ఒకింత జట్టుకు మరింత బలాన్ని కలిగిస్తుందని పేర్కొన్నాడు.
మొత్తంగా ప్రస్తుతం ఎంపిక చేసిన వరల్డ్ కప్ జట్టు సమతుల్యంగా ఉందని ప్రశంసించాడు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కు బిగ్ కాంప్లిమెంట్ అనుకోక తప్పదు.