స్కామ్ లు..మోసాలకు కూటమి కేరాఫ్
నిప్పులు చెరిగిన నరేంద్ర మోడీ
పశ్చిమ బెంగాల్ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఆయన వారణాసి లోక్ సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీ, రోడ్ షోలో పాల్గొన్నారు. జనం ఆయనకు అపూర్వమైన రీతిలో సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇండియా కూటమి దాదాపు ఖరారైందన్నారు. ఇక బీజేపీ కూటమికి కనీసం 400 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు మోదీ. కుంభ కోణాలు, అవినీతి, అక్రమాలు, స్కామ్ లకు పెట్టింది పేరు ప్రతిపక్షాలంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఓ వైపు ప్రపంచ దేశాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే కుంభకోణాల రికార్డులు సృష్టించడంలో కాంగ్రెస్ నిమగ్నమైందంటూ ఎద్దేవా చేశారు ప్రధాన మంత్రి. దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. తాను వచ్చాక దేశాన్ని వెలిగి పోయేలా చేశానని చెప్పారు. ఇవాళ బలమైన ఆర్థిక శక్తిగా తీర్చే పనిలో ఉన్నానని అన్నారు మోదీ.