హస్తినలో కమల వికాసం ఖాయం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
న్యూఢిల్లీ – దేశంలోనే కాదు దేశ రాజధాని హస్తినాపురం (న్యూఢిల్లీ)లో భారతీయ జనతా పార్టీ పతాకం రెప రెప లాడడం ఖాయమని స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ తరపున న్యూ ఢిల్లీ లోని మాలవీయ నగర్ లో భారీ ఎత్తన రోడ్ షో చేపట్టారు. ఎక్కడ చూసినా జనం మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు.
రోడ్ షోను ఉద్దేశించి జేపీ నడ్డా ప్రసంగించారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నూరైనా సరే ఈసారి దేశమంతటా కాషాయపు గాలి వీస్తోందని చెప్పారు. ప్రజల మద్దతు ఉత్సాహం చూస్తుంటే తనకు మరింత సంతోషం కలుగుతోందన్నారు జేపీ నడ్డా.
తమ పార్టీకి 543 సీట్లకు గాను కనీసం 400 సీట్లకు పైగానే వస్తాయని జోష్యం చెప్పారు. 143 కోట్ల మంది భారతీయులు సమర్థవంతమైన నాయకుడిని, సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఇక ప్రతిపక్షాలతో కూడిన కూటమిని జనం నమ్మడం లేదని ఆ కూటమికి కనీసం 40 సీట్లు కూడా రావన్నారు.