రేవ్ పార్టీనా..అదెక్కడ – జానీ
నాకు ఆ పార్టీతో సంబంధం లేదు
హైదరాబాద్ – ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రేవ్ పార్టీ అంటే ఏమిటో కూడా తెలియదన్నారు. అలాంటి అమాయకుడిని పట్టుకుని తాను పాల్గొంటున్నట్లు ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఓ ఓడియో సందేశాన్ని షేర్ చేశారు జానీ మాస్టర్.
ఆయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అంతే కాదు ఈసారి జరిగిన ఎన్నికల్లో తన తరపున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. వచ్చే జూన్ 4న ఏ పార్టీ గెలుస్తుందనేది తేలుతుంది. ఇది పక్కన పెడితే బెంగళూరులోని ఎలక్ట్రిసిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీ నటులు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇందులో ప్రముఖ నటి హేమ కూడా ఉందని బెంగళూరు పోలీసులు నిర్దారించారు. ఇక పట్టుకున్న వారిలో కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉన్నారని పెద్ద ఎత్తున టాక్ వచ్చింది. దీనిపై స్పందించారు జానీ మాస్టర్. అదంతా పూర్తిగా అబద్దమని తేల్చారు. సంతాప సభలో ఉన్నానని షేర్ చేశారు.