జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణం
చేస్తారని ప్రకటించిన వైవీ సుబ్బారెడ్డి
అమరావతి – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి కీలక వ్యాఖ్యల చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ మరోసారి విజయ దుందుభి మోగించడం ఖాయమని అన్నారు. ముచ్చటగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తప్పదన్నారు. తమ పార్టీకి కనీసం 150కి తక్కువ కాకుండా సీట్లు వస్తాయని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
50 రోజుల పాటు కాలికి బలపం కట్టుకుని పక్షి లాగా పర్యటించారని, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా చేయడంలో సక్సెస్ అయ్యాడంటూ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పారు. చంద్రబాబు నాయుడు కూటమికి ఈసారి కూడా భంగపాటు తప్పదని హెచ్చరించారు.
చిల్లర మల్లర రాజకీయాలు చేసే వారిని జనం ఆదరించరని, కష్టాల్లో ఉన్న ప్రజలను ఎవరైతే కడుపున పెట్టుకుని చూసుకుంటారో వారిని తమ దేవుడిగా కొలుస్తారని , కులం పేరుతో ప్రజలను విభజించి పాలించాలని అనుకునే చంద్రబాబు, పవన్ , బీజేపీకి ఇక కాలం చెల్లిందన్నారు వైవీ సుబ్బారెడ్డి.
ఇదిలా ఉండగా వచ్చే జూన్ 9న ఉదయం 9 గంటల 18 నిమిషాలకు రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు.