పాకిస్తాన్ తో ఆడేందుకు సిద్దం
ప్రకటించిన కెప్టెన్ రోహిత్ శర్మ
ముంబై – త్వరలో టి20 వరల్డ్ కప్ జరుగుతున్న తరుణంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టుతో ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనుమతి గనుక ఇచ్చినట్లయితే కచ్చితంగా తాము పాకిస్తాన్ కు వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు రోహిత్ శర్మ.
ప్రస్తుతం బీసీసీఐ కేవలం భద్రతా కారణాల రీత్యా మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఇవ్వడానికి ఉత్సుకత చూపడం లేదన్నారు కెప్టెన్. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య అభిప్రాయాలలో భేదాలు ఉండవచ్చని కానీ ఆటల పరంగా ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు రోహిత్ శర్మ.
ఇదిలా ఉండగా కేవలం తటస్థ వేదికల మీద మాత్రమే దాయాది దేశంతో భారత్ ఆడుతోంది. మొత్తంగా ఈసారి టీ20 వరల్డ్ కప్ క్రికెట్ లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఫ్యాన్స్ కు. దేశాలు వేరైనా ప్రాంతాలు వేరైనా జాతులు వేరైనా ఆట మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు భారత జట్టు కెప్టెన్.