SPORTS

కోల్ క‌తా జోరు హైద‌రాబాద్ హుషారు

Share it with your family & friends

ఫైన‌ల్ బాద్ షా తేలేది నేడే

గుజ‌రాత్ – గ‌త కొన్ని రోజులుగా అల‌రిస్తూ వ‌స్తున్న ఐపీఎల్ 2024 టోర్నీ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. నాలుగు జ‌ట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. టాప్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఉండ‌గా రెండో స్థానంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , మూడో స్థానంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , నాలుగో స్థానంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఉన్నాయి.

తొలి క్వాలిఫ‌య‌ర్ లో ఏ జ‌ట్టు వెళుతుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. మంగ‌ళ‌వారం గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ న‌రేంద్ర మోదీ స్టేడియంలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ , స‌న్ రైజ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య హోరా హోరీ పోరు కొన‌సాగ‌నుంది. ఒక‌వేళ వ‌ర్షం గ‌నుక వ‌స్తే మ్యాచ్ ను మ‌రుస‌టి రోజున నిర్వ‌హిస్తారు.

ఈ మ్యాచ్ లో ఎవ‌రు గెలిచినా నేరుగా ఫైన‌ల్ కు వెళ‌తారు. ఇంకో మ్యాచ్ ఆడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అయితే ఓడి పోయిన జ‌ట్టుకు ఫైన‌ల్ కు వెళ్లేందుకు మ‌రో ఛాన్స్ కూడా ఉంటుంది. ఇరు జ‌ట్లు ఊహించ‌ని రీతిలో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాయి. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతూ ఆడాయి.

ప్ర‌ధానంగా ప్యాట్ క‌మిన్స్ సార‌థ్యంలోని హైద‌రాబాద్ దుమ్ము రేపుతోంది. ఇక రైనా నాయ‌క‌త్వంలోని కోల్ క‌తా అద్భుత విజ‌యాల‌ను స్వంతం చేసుకుని నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. ఇవాళ రాత్రి ప్రారంభం అయ్యే ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెల‌కొంది.