నీతా అంబానీ షాకింగ్ కామెంట్
ముంబై ఇండియన్స్ జట్టు యజమాని
ముంబై – ఐపీఎల్ 2024 టోర్నీలో ఈసారి ఆశించిన మేర రాణించ లేదు ముంబై ఇండియన్స్ జట్టు. పేలవమైన ఆట తీరుతో తీవ్ర నిరాశకు గురి చేసింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను ఉన్నట్టుండి యాజమాన్యం తొలగించింది. హిమ్ మ్యాన్ స్థానంలో ఉన్నట్టుండి షాక్ ఇస్తూ గుజరాత్ టైటాన్స్ జట్టు స్కిప్పర్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకుంది. భారీ ధరకు కొనుగోలు చేసింది.
కానీ వర్కవుట్ కాలేదు. అర్థం పర్థం లేని నిర్ణయాలు, ఆశించిన మేర రాణించలేక పోవడం, జట్టు సమిష్టిగా ఆడక పోవడం , వెరిసి సవాలక్ష కారణాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది ముంబై ఇండియన్స్. పాయింట్ల పట్టికలో పంజాబ్ తర్వాత ముంబై నిలవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
జట్టులో ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు ఆడినా ఫలితం లేకుండా పోయింది. జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు యజమాని అయిన నీతా అంబానీ. ఆటలో గెలుపు ఓటములు మామూలేనని , అయినా ఎందుకని మెరుగైన ఆట తీరును కనబర్చ లేక పోయిందనే దానిపై ఫోకస్ పెడతామన్నారు.
తమ జట్టు నుంచి నలుగురు ఆటగాళ్లు ఇప్పుడు టి20 వరల్డ్ కప్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వారికి తాను అభినందనలు తెలియ చేస్తున్నట్లు చెప్పారు నీతా అంబానీ. రోహిత్ శర్మ, పాండ్యా, సురేష్ కుమార్ యాదవ్ , బుమ్రా ఉన్నారు.