కన్నడ సర్కార్ ఏడాది పూర్తి
సీఎం కు డిప్యూటీ సీఎం కంగ్రాట్స్
కర్ణాటక – కన్నడ నాట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్బంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు మిన్నంటాయి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న సర్కార్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చేలా చేశారు ఆ పార్టీ చీఫ్ , ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. సర్కార్ ఉండదని, కొద్ది రోజుల్లోనే కూలి పోతుందంటూ ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఎంతగా ప్రచారం చేసినా చివరకు స్థిరంగా పాలన సాగిస్తూ వచ్చింది.
ఎన్నికల సందర్బంగా ఇచ్చిన 5 హామీలను అమలు చేసింది . సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే ఎస్ ల సంయుక్త నాయకత్వంలో కూల్ గా పాలన సాగుతోంది. ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ ఇద్దరు నేతలు.
అంతే కాకుండా పక్కనే ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావడానికి తనవంతు ప్రయత్నం చేశారు , మద్దతు ప్రకటించారు డీకే శివకుమార్. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్బంగా సీఎం సిద్దరామయ్యకు శాలువా కప్పి సన్మానించారు డీకే శివకుమార్.