పాండ్యా కెప్టెన్సీపై భజ్జీ కామెంట్
అతడి వల్లనే ముంబై ఓడింది
న్యూఢిల్లీ – భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, ప్రస్తుత ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఆఖరి అంకానికి చేరుకుంది. మొత్తం నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి.
ఇందులో కోల్ కతా , హైదరాబాద్ , రాజస్థాన్ , బెంగళూరు నిలిచాయి. ఇవాళ అత్యంత కీలకమైన మ్యాచ్ కోల్ కతా , హైదరాబాద్ మధ్య జరగనుంది. ఇదిలా ఉండగా గతంలో ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి ప్లే ఆఫ్స్ కు చేరకుండానే చాప చుట్టేసింది.
రోహిత్ శర్మను పక్కన పెట్టి ఊహించని విధంగా హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది యాజమాన్యం. దీనిపై సీరియస్ గా స్పందించారు హర్భజన్ సింగ్. తాను కూడా ముంబై తరపున 10 ఏళ్ల పాటు ఆడానని అన్నాడు.
విచిత్రం ఏమిటంటే జట్టు సభ్యులతో సంప్రదింపులు జరపకుండా పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడం వల్లనే అయోమయం నెలకొందన్నారు. పేలవమైన నాయకత్వానికి తోడు జట్టు సభ్యులు కూడా ఆశించిన మేర రాణించ లేదన్నాడు. ముంబై ఓడి పోయేందుకు కారణం పాండ్యానేనంటూ బాంబు పేల్చాడు భజ్జీ.