మోదీ విద్వేషాలు రెచ్చగొడితే ఎలా..?
నిప్పులు చెరిగిన సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు – రాష్ట్ర ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రధానమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం పేరుతో, మతం పేరుతో దేశాన్ని , రాష్ట్రాలను, మనుషుల మధ్య విభేదాలు సృష్టించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
తమిళనాడులో వ్యతిరేకత రావడంతో ఇక్కడికి రాకుండానే పోయారని, చివరకు ఒడిశా, బీహార్ లలో పర్యటించారని అక్కడంతా విద్వేషం వెల్లగక్కుతూ ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు ఛీ కొట్టడం తప్పదన్నారు.
ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి , కూటమికి షాక్ తప్పదన్నారు ఎంకే స్టాలిన్. ఎన్నికలయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో తన టూర్ ను రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అంతే కాకుండా ఒడిశా లోని పూరీ జగన్నాథ్ ఆలయ ఆస్తులను తమిళులు దోచుకుంటున్నారని ఆరోపించడం దారుణమన్నారు.
ఉత్తరాది లోని తమిళులను దూషించడం, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం ప్రధానికి అవసరామా అని ప్రశ్నించారు సీఎం ఎంకే స్టాలిన్.