SPORTS

కోల్ క‌తా జోష్ బాద్ షా ఖుష్

Share it with your family & friends

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ విక్ట‌రీ

గుజ‌రాత్ = ఐపీఎల్ 2024లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ త‌న‌కు ఎదురే లేద‌ని స‌త్తా చాటింది. కీల‌క‌మైన క్వాలిఫ‌య‌ర్ 1 లీగ్ మ్యాచ్ లో దుమ్ము రేపింది. మ్యాచ్ మొత్తం కేకేఆర్ డామినేటే్ చేసింది. భారీ తేడాతో స‌న్ రైజ‌ర్స్ ను ఓడించడంతో కేకేఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ప్ర‌ముఖ న‌టుడు , బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అంతులేని సంతోషానికి లోన‌య్యాడు.

అహ్మ‌దాబాద్ లోని మొతేరా స్టేడియం అంత‌టా క‌లియ తిరిగాడు. ఐపీఎల్ మొత్తంగా త‌మ జ‌ట్టుకు వెన్ను ద‌న్నుగా నిలుస్తూ వ‌చ్చిన అభిమానుల‌కు అభివాదం చేశాడు. భారీ ఎత్తున చ‌ప్ప‌ట్ల‌తో తిరిగి అభివాదం చేశారు.

ఇదిలా ఉండ‌గా ఈసారి ఐపీఎల్ సీజ‌న్ లో కోల్ క‌తా ఆశించిన దాని కంటే అద్బుతంగా ఆడుతోంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్, ఫీల్డింగ్ ల‌లో సూప‌ర్ షో చేసింది. ద‌ర్జాగా ఐపీఎల్ ఫైన‌ల్ కు చేరుకుంది కోల్ క‌తా. కోల్ క‌తా బౌల‌ర్ల‌లో మిచెల్ హైద‌రాబాద్ న‌డ్డి విరిచేస్తే వెంక‌టేష్ అయ్య‌ర్ 51 ర‌న్స్ తో దుమ్ము రేపాడు. ఇక కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అదుర్స్ అనిపించేలా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. హైద‌రాబాద్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 13,4 ఓవ‌ర్ల‌లోనే ఛేదించారు.