SPORTS

స‌మ ఉజ్జీల మ‌ధ్య స‌మ‌రం

Share it with your family & friends

గెలిచేది ఎవ‌రు నిలిచేది ఎవ‌రో

చెన్నై – ఐపీఎల్ 2024లో ఫైన‌ల్ ఎవ‌రో తేల్చే కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక చెన్నై సిద్ద‌మైంది. తొలి సెష‌న్ లో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నిలిచిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సెకండ్ సెష‌న్ లో చేతులెత్తేసింది. దీంతో తాడో పేడో తేల్చు కోవాల్సిన ప‌రిస్థితి కొని తెచ్చుకుంది. ఆ జ‌ట్టు ఇప్పుడు సంక‌ట స్థితిని ఎదుర్కొంటోంది. ఇక పాఫ్ డుప్లెసిస్ సార‌థ్యంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ఊహించ‌ని రీతిలో ఫైన‌ల్ కు వెళ్లాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఇవాళ టోర్నీలో ఫైన‌ల్ పోరుకు చేరాలంటే ఈ మ్యాచ్ లో నెగ్గి తీరాల్సిన ప‌రిస్థితి ఇటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు అటు బెంగ‌ళూరుకు ఉంది. అత్యంత కీల‌కం ఎలిమినేట‌ర్ మ్యాచ్. ఎవ‌రు గెలిస్తే వారు ఐపీఎల్ క‌ప్ రేసులో ఉంటారు. లేక పోతే ఇంటి దారి ప‌డ‌తారు.

ఇరు జ‌ట్లు బ‌లంగానే ఉన్నాయి. కానీ మైదానంలో దిగితే కానీ తెలియ‌దు ఏ జ‌ట్టు ఎలా ఆడుతుంద‌నేది. మొత్తంగా అంద‌రి క‌ళ్లు ఈ మ్యాచ్ పైనే ఉన్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో సాగే ఈ మ్యాచ్ లో ఎవ‌రు విజేత‌గా నిలుస్తార‌నేది కొద్ది సేపు ఆగితే కానీ తెలియ‌దు.

ఇప్ప‌టికే ఫైన‌ల్ కు వెళ్లిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో ఎవ‌రు వెళ‌తారో చూడాలి.