బ్లాక్ మెయిలర్ ను ఓడించండి
నిప్పులు చెరిగిన కేటీఆర్
నల్లగొండ జిల్లా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ సర్కార్ పై ధ్వజమెత్తారు. ఆ పార్టీ బ్లాక్ మెయిలర్లకు టికెట్లు ఇచ్చిందని మండిపడ్డారు. తమ పార్టీ విద్యాధికుడైన అనుగుల రాకేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చిందని , నిరుద్యోగులు ప్రశ్నించే గొంతుకగా ఉన్న ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగార్జున సాగర్‌లో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో పాల్గొ\ని ప్రసంగించారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసిందన్నారు.
నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిందని, వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని దానికి దిక్కు లేకుండా పోయిందన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పడం, తన ప్రచారంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడంటూ ఆరోపించారు.
మన నాగార్జున సాగర్‌ను తీసుకొని పోయి కేఆర్ఎంబీకి తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతు అని చెప్పుకునే మల్లన్న, పుల్లన్న దీనిపై ఒక్కసారైనా అడిగిండా అని ప్రశ్నించారు కేటీఆర్. జైవీర్ , రఘువీర్ రెడ్డిలు వీటి గురించి ఎప్పుడైనా నిలదీశారా అని అన్నారు.