NEWSANDHRA PRADESH

కాకాణిపై విచార‌ణ చేప‌ట్టాలి

Share it with your family & friends

చంద్ర‌మోహ‌న్ రెడ్డి డిమాండ్

నెల్లూరు జిల్లా – టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న వైసీపీకి చెందిన మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. బెంగ‌ళూరు రేవ్ పార్టీలో మంత్రికి సంబంధించిన పాస్ పోర్ట్, కారు స్టిక్క‌ర్లు దొర‌క‌డం క‌ల‌క‌లం రేపింది.

పాస్‍పోర్ట్, కారు స్టిక్కర్ తో తనకు సంబంధం లేదని కాకాణి కహానీలు చెబుతున్నారని ఆరోపించారు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. ఆధారాలు లేకుండా తాను ఆరోప‌ణ‌లు చేయ‌డం లేద‌న్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి ఏనాడైనా నిజం చెప్పారా అని ప్ర‌శ్నించారు. ఆయ‌న మాట్లాడేవ‌న్నీ అబ‌ద్దాలు త‌ప్పా నిజాలు కావ‌న్నారు. డ్రగ్స్, లిక్కర్, రెడ్ శాండల్ మాఫియాతో కాకాణికి లింకులు ఉన్నాయ‌ని ఆరోపించారు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని , విచార‌ణ‌కు ఆదేశించాల‌ని డిమాండ్ చేశారు.