అజిత్ అంజుమ్ వైరల్
యూపీలో కాంగ్రెస్ పార్టీ హవా
ఉత్తర ప్రదేశ్ – ఎవరీ అజిత్ అంజుమ్ అనుకుంటున్నారా. మోస్ట్ పాపులర్ జర్నలిస్ట్. తను ఈ మధ్య చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 5 విడతల పోలింగ్ ముగిసింది. ముందస్తు అంచనాలు తారు మారు అయ్యేలా ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అజిత్ అంజుమ్ గత కొంత కాలం నుంచి ఎన్నికలపై విస్తృతంగా ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన యూపీలో పర్యటించారు. తన అనుభవాలను యూట్యూబ్ మాధ్యమం ద్వారా పంచుకున్నారు.
ఈ సందర్భంగా అమేథి ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. రాజ్ దీప్ సర్దేశాయ్ , అజిత్ అంజుమ్ తో పాటు అనేక టీవీ ఛానళ్లు, జర్నలిస్టులు తనకు వ్యతిరేకంగా పని చేశారంటూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు. ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. తను ఓడి పోతోందంటూ అజిత్ అంజుమ్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.