అందరి కళ్లు గంభీర్ పైనే
కోల్ కతా గెలుపు వెనుక
హైదరాబాద్ – ఏ మాత్రం ఓటమి ఒప్పుకోని తత్వం భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ది. ఆయన బీజేపీ మద్దతుదారుగా ఉన్నారు. ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఐపీఎల్ 2024లో మోస్ట్ సెర్చింగ్ ప్లేయర్ గా గుర్తింపు పొందారు. దీనికి కారణం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు తను మెంటార్, కోచ్ గా ఉన్నాడు. తను వచ్చాక ఆ జట్టు రూపు రేఖలను పూర్తిగా మార్చేశాడు. పూర్తిగా జట్టులో కసిని నింపాడు. ఎలాగైనా ఏ జట్టు అయినా సరే గెలుపే లక్ష్యం కావాలని నిర్దేశించాడు.
ప్రస్తుతం ఆ జట్టు టేబుల్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. పలు విజయాలు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు గౌతమ్ గంభీర్. ఇదిలా ఉండగా ప్రస్తుతం బీసీసీఐ ఫుల్ ఫోకస్ పెట్టింది. భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తవుతుంది. ఇంకా ఒక నెల మాత్రమే ఉంది. దీంతో జట్టు శిక్షకుడి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
ఈ మేరకు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం హెడ్ కోచ్ రేసులో లక్ష్మణ్ , ఇతర క్రికెటర్లు ఉన్నా బీసీసీఐ కేవలం గౌతం గంభీర్ వైపు మొగ్గు చూపుతోంది.