హస్తినలో బీజేపీ పాగా పక్కా
కేంద్ర హోం శాఖ మంత్రి
న్యూఢిల్లీ – దేశ రాజధాని న్యూఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. బీజేపీ మొత్తం 7 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఢిల్లీలో తమ పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి అంత సీన్ లేదన్నారు. ఆ పార్టీ నామ రూపాలు లేకుండా పోతుందన్నారు అమిత్ చంద్ర షా. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ ఆప్ అంటూ మండిపడ్డారు. ఆ పార్టీ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సిగ్గు అనేది ఉందా అని ప్రశ్నించారు షా.
తాము ఏనాడూ పదవుల కోసం పాకు లాడిన దాఖలాలు లేవన్నారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చామన్నారు కేంద్ర మంత్రి. కానీ కేజ్రీవాల్ ఇంకా సీఎం పదవిని పట్టుకుని వేలాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన ఇప్పటికే ఓ కేసులో జైలుకు వెళ్లి వచ్చారని, ఇంకా 7 కేసులు నమోదై ఉన్నాయని గుర్తు చేశారు.