దీదీ కామెంట్స్ సన్యాసులు సీరియస్
24న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపు
పశ్చిమ బెంగాల్ – పశ్చిమ బెంగాల్ లో సన్యాసులు తీవ్ర ఆగ్రహంతో ఊగి పోతున్నారు. వారంతా తమపై అనుచిత కామెంట్స్ చేయడంపై మండి పడుతున్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఈనెల 24న నిరసన చేపట్టేందుకు పిలుపునిచ్చారు సన్యాసులంతా.
కోల్ కతాలో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని సన్యాసుల అపెక్స్ బాడీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బంగియ సన్యాసి సమాజ్ కూడా ఇందులో ఉండడం విశేషం. వారంతా సీఎం దీదీని తీవ్రంగా తప్పు పడుతున్నారు.
ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ సీరియస్ కామెంట్స్ చేశారు సన్యాసులను ఉద్దేశించి. కొంత మంది సన్యాసులు రాష్ట్రంలో అల్లర్లను ప్రేరేపించారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా ప్రచారం సందర్భంగా తమ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు టీఎంసీ సన్యాసులపై దాడులు చేస్తోందంటూ ప్రధాన మంత్రి మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.