అదానీ బొగ్గు స్కామ్ పై రాహుల్ ఫైర్
తాము వచ్చాక విచారణ చేపడతాం
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి గౌతం అదానీ పై భగ్గుమన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున చోటు చేసుకున్న బొగ్గు కుంభకోణం వెలుగు చూసిందని తెలిపారు. దీనికి పీఎం పూర్తిగా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ఏళ్ల తరబడి ఈ బొగ్గు స్కాం కొనసాగుతోందని ఆరోపించారు రాహుల్ గాంధీ . మోడీ తన అభిమాన మిత్రుడు అదానీ చేసిన నిర్వాకం కారణంగా వేల కోట్ల రూపాయలు సర్కార్ నష్ట పోయిందన్నారు. దీనికి పూర్తి బాధ్యత మోడీ, అదానీనేని పేర్కొన్నారు .
వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడని , ఈ బహిరంగ దోపిడీ, కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీలు మౌనంగా ఎందుకు ఉన్నాయంటూ ప్రశ్నించారు. జూన్ 4 తర్వాత భారత కూటమి సర్కార్ ఏర్పడుతుందని, వచ్చాక విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ప్రజల నుండి దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తామని హెచ్చరించారు రాహుల్ గాంధీ.