సిఫారసు లేఖలకు లైన్ క్లియర్
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల – శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల కోడ్ కారణంగా సిఫారసు లేఖలకు చెక్ పెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎట్టకేలకు లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు సిఫారసు లేఖలను అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది.
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకునేందుకు వీలవుతుంది. దీని వల్ల చాలా మందికి ఊరట కలగనుంది. ఏపీలో ఎన్నికల కోడ్ కారణంగా గత మార్చి నెల నుంచి సిఫారసు లేఖల ద్వారా దర్శనం టికెట్లు బంద్ చేసింది.
ఇప్పుడు ఆ వెసులుబాటు తిరిగి తీసుకు వస్తున్నట్లు తెలిపింది. తిరిగి మే 20న సోమవారం నుంచి సిఫారసు లేఖలను స్వీకరించనున్నట్లు వెల్లడించింది టీటీడీ. దేవుడి దర్శనానికి సిఫారసు లేఖలను తీసుకు వెళ్లవచ్చని తెలిపింది.
బ్రేక్ దర్శనానికి అనుమతి ఇవ్వాలని టీటీడీ ఈసీని కోరింది. సీఈవో ఓకే చెప్పడంతో సిఫారసు లేఖలకు లైన్ క్లియర్ అయ్యింది. రోజుకు 10 రూ. 300 ఎస్ఈడీ బ్రేక్ దర్శనం టికెట్లు జారీ చేస్తారు. ఎంపీలకు 12 , ఎమ్మెల్యేలకు 6 చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను జారీ చేస్తారని తెలిపింది.