NEWSNATIONAL

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో డీఎంకే హ‌వా

Share it with your family & friends

ఓటింగ్ శాతం పెరిగింద‌న్న సీఎం

త‌మిళ‌నాడు – రాష్ట్రంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిశాయి. అధికారంలో ఉన్న డీఎంకే తో పాటు భార‌తీయ జ‌న‌తా పార్టీ, అన్నా డీఎంకే , త‌దిత‌ర పార్టీల‌న్నీ బ‌రిలో నిలిచాయి. ఈసారి ఎన్నిక‌లు నువ్వా నేనా అన్న రీతిలో జ‌రిగాయి. దేశ వ్యాప్తంగా తొలిసారిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏడు విడ‌త‌లుగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తూ వ‌స్తోంది.

డీఎంకే , కాంగ్రెస్ , ఇత‌ర ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసి ఇండియా కూట‌మిలో ఉన్నాయి. సీట్ల స‌ర్దుబాటులో భాగంగా కొన్ని సీట్ల‌ను వ‌దులుకుంది డీఎంకే. ఈసారి సీఎం ఎంకే స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌తి బూత్ వారీగా న‌మోదైన ఓట్లు, ఫారం -17ను సేక‌రించారు. ఓటింగ్ శాతం పెరిగేలా చూశారు.

ప్ర‌భుత్వ ప‌రంగా ఇచ్చిన హామీల మేర‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను , కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తూ వ‌స్తున్నారు స్టాలిన్ . రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే పార్టీ 68,000 పోలింగ్ బూత్ ల నుంచి ఫారంల‌ను సేక‌రించ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా స్టాలిన్ పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. ఈసారి డీఎంకే చ‌రిత్ర సృష్టిస్తుంద‌ని, భారీ ఎత్తున సీట్ల‌ను కైవ‌సం చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌క‌టించారు.