NEWSANDHRA PRADESH

పిన్నెల్లి నిర్వాకం సీఈసీ ఆగ్ర‌హం

Share it with your family & friends

ఏడేళ్ల పాటు శిక్ష ప‌డే ఛాన్స్
అమ‌రావ‌తి – పోలింగ్‌ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను ధ్వంసం చేశారని, ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించామ‌ని చెప్పారు.

ఈవీఎంల‌ను ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందన్నారు. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించామన్నారు. ఈ ఘటనకు సంబంధించి సిట్‌కు పోలీసులు అన్ని వివరాలను అందించారని తెలిపారు.

20న రెంటచింతల ఎస్‌ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పేర్కొన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారు. ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉంది. సంగారెడ్డి వ‌ద్ద దాక్కున్న పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు.

మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు సీఈవో. ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదన్నారు. ఈ ఘటన నమోదైన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయని, ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదన్నారు.