SPORTS

అనుష్క శ‌ర్మ కంట‌త‌డి

Share it with your family & friends

రాజ‌స్థాన్ చేతిలో ఆర్సీబీ చిత్తు

అహ్మ‌దాబాద్ – ఐపీఎల్ 2024లో భాగంగా అహ్మ‌దాబాద్ మొతేరా స్టేడియంలో జ‌రిగిన కీల‌కమైన ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ దుమ్ము రేపింది. ఎలాగైనా స‌రే ఈసారి ఐపీఎల్ క‌ప్పు గెల‌వాల‌ని ఆశ‌లు పెట్టుకున్న ఆర్సీబీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.

ప్ర‌ధానంగా ఆ జ‌ట్టుకు చెందిన య‌శ‌స్వి జైశ్వాల్ , రియాన్ ప‌రాగ్ , సిమ్రోన్ హిట్మైర్ అద్భుతంగా ఆడారు. 177 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇంకా బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించారు. సెమీ ఫైన‌ల్ పోరుకు సిద్ద‌మ‌య్యారు.

ఇదిలా ఉండ‌గా విరాట్ కోహ్లీ స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ స్టాండ్స్ లో ఉండి వీక్షించింది. త‌న భ‌ర్త బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించాడు. అంతే కాదు కీల‌క స‌మ‌యంలో ధ్రువ్ జురైల్ ను ర‌నౌట్ చేశాడు. మ్యాచ్ చివ‌రి దాకా ఉత్కంఠ భ‌రితంగా సాగింది. మొత్తంగా ఆర్సీబీకి షాక్ ఇచ్చింది. గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్.

దీంతో ఎంతో ఆశ‌లు పెట్టుకున్న అనుష్క శ‌ర్మ భావోద్వేగానికి లోన‌య్యింది. ఇందుక సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి.