NEWSTELANGANA

కాంగ్రెస్ స‌ర్కార్ బేకార్

Share it with your family & friends

మాజీ మంత్రి హ‌రీశ్ రావు

సిద్దిపేట జిల్లా – మాజీ మంత్రి హ‌రీశ్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా రైతుల‌ను ఆదుకుంటాన‌ని చెప్పిన ప్ర‌భుత్వం ఇప్పుడు చేతులెత్తేసింద‌ని ఆరోపించారు. ఆయ‌న చిన్న కోడూరులో ఏర్పాటు చేసిన వ‌డ్ల కొనుగోలు కేంద్రాన్ని సంద‌ర్శించారు.

ఇప్ప‌టికే అకాల వ‌ర్షాల కార‌ణంగా రైతులు త‌మ ధాన్యాన్ని కోల్పోయార‌ని వారిని ఆదుకోవాల్సిన స‌ర్కార్ ప‌ట్టించు కోవ‌డం లేదంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాదంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హ‌రీశ్ రావు.

ఓ వైపు వాతావ‌ర‌ణ శాఖ మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించినా ఎందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదంటూ ప్ర‌శ్నించారు హ‌రీశ్ రావు. ఆరుగాలం
కష్టపడి పంట పండించిన రైతులు కల్లాల్లో పడిగాపులు కాయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు.

రైస్ మిల్ల‌ర్లు ధాన్యం కొనుగోలు చేయ‌కుండా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు హ‌రీశ్ రావు.