NEWSANDHRA PRADESH

రాకేష్ రెడ్డిని గెలిపించండి – జేడీ

Share it with your family & friends

పిలుపునిచ్చిన మాజీ సీబీఐ డైరెక్ట‌ర్

అమ‌రావ‌తి – జై భార‌త్ పార్టీ అధ్య‌క్షుడు జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీలో ఇటీవ‌లే చేరి..ప్ర‌స్తుతం ఖ‌మ్మం ..వ‌రంగ‌ల్ – న‌ల్గొంగ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. విద్యావేత్త అనుగుల రాకేశ్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు జేడీ లక్ష్మీ నారాయ‌ణ‌.

ప్ర‌జా సేవ‌లో మంచి నేప‌థ్యం, చ‌రిత్ర క‌లిగిన యువ నాయ‌కుడు రాశేష్ రెడ్డికి మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని పిలుపునిచ్చారు. నిరుద్యోగులు, ప‌ట్ట‌భ‌ద్రులంతా క‌లిసిక‌ట్టుగా ప‌ని చేసే నాయ‌కుడికి ఓటు వేసి గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు.

ఇదిలా ఉండ‌గా త‌న‌కు జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ లాంటి గొప్ప నాయ‌కుడు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం జీవితంలో మ‌రిచి పోలేన‌ని అన్నారు అభ్య‌ర్థి రాకేశ్ రెడ్డి. ఆయ‌న మ‌ద్ద‌త‌కు త‌న‌కు కొండంత నైతిక బ‌లాన్ని ఇచ్చేలా చేసింద‌ని స్ప‌ష్టం చేశారు.

రాజకీయాల్లో ప్రతిభకు స్థానం ఉండాలని, ప‌ని చేసే వారికి పట్టం కట్టాలని మీరు పడుతున్న తపనకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు.