NEWSTELANGANA

గాడి త‌ప్పిన కాంగ్రెస్ పాల‌న

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి

హైద‌రాబాద్ – రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని కోల్పోయింద‌న్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖ‌మ్మం – న‌ల్ల‌గొండ – వ‌రంగ‌ల్ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల సంద‌ర్బంగా జ‌రిగిన స‌న్నాహ‌క స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మేధావుల‌ను, ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయిన నాయ‌కుల‌ను ఎన్నుకుంటే ప్ర‌జాస్వామ్యానికి అర్థం ఉంటుంద‌న్నారు కేటీఆర్. చదువుకున్నోళ్ళు, మంచి వాళ్ళు రాజకీయాలలోకి రావాలంటే, వారికి ఉత్సాహం ఉండాలంటే వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత పట్టభధ్రులదేన‌ని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి.

చింతపండు అలియాస్ తీన్మార్ లాంటి లంగలకు, దొంగలకు ఓటేస్తే.. చట్ట సభలు చెత్త సభలు అవుతాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి లేదన్నారు. అనతి కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి పాల‌నా ప‌రంగా చేతులెత్తేశార‌ని , పూర్తిగా స‌ర్కార్ గాడి త‌ప్పింద‌న్నారు .