దేశంలో మరోసారి మోదీనే పీఎం
యుఎస్ రాజకీయ శాస్త్రవేత్త ఇయాన్
అమెరికా – అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త ఇయాన్ బ్రెమ్మర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పై వ్యాఖ్యానించారు. గతంలో కంటే ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి సీట్లు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
మోదీ హవా కొనసాగుతోందని, కనీసం ఆ పార్టీకి 305 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 2019లో బీజేపీ సంకీర్ణ కూటమికి ఎక్కువగా రానున్నాయని పేర్కొన్నారు.
ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర దాస్ మోడీ ముచ్చటగా మూడోసారి పీఎం కావడం ఖాయమని జోష్యం చెప్పారు.
సుస్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం రెండూ దేశానికి రక్షణ కవచంగా పని చేస్తున్నాయని ఇదే మోదీకి అడ్వాంటేజ్ గా మారనుందని పేర్కొన్నారు ఇయాన్ బ్రెమ్మర్. మొత్తంగా బీజేపీ ఫుల్ ఖుష్ లో ఉంది ఆయన చేసిన వ్యాఖ్యలు.