మోదీకి అంత సీన్ లేదు
అరవింద్ కేజ్రీవాల్ ఫైర్
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధాన మంత్రి మోదీని టార్గెట్ చేశారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. తను పదే పదే అబద్దాలను ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. 400 సీట్లకు పైగా వస్తాయని చెప్పడం దారుణమన్నారు. దేశానికి గత 10 ఏళ్ల పాలనా కాలంలో ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అబద్దాలను ప్రచారం చేస్తూ కులం పేరుతో, మతం పేరుతో ఓట్లను కొల్లగొట్టాలని చూడడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా దేవాలయాలు, దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గోబెల్స్ ప్రచారంలో మోదీని మించిన నాయకుడు ప్రపంచంలో లేడన్నారు అరవింద్ కేజ్రీవాల్.
ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమికి ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఆప్ చీఫ్.