ధ్రువ్ రాఠీపై రిజిజు సెటైర్
దేశం కోసం పని చేస్తే బెటర్
న్యూఢిల్లీ – కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మోస్ట్ పాపులర్ గా నిలిచాడు యూట్యూబర్ ధ్రువ్ రాఠీ. ఆయన ప్రధానంగా దేశంలో గత 10 ఏళ్లుగా పాలన సాగిస్తున్నప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ను లక్ష్యంగా చేసుకున్నారు.
గత కొంత కాలం నుంచీ అసమర్థ పాలన, దేశాన్ని ఎలా మోస పూరితంగా పని చేస్తున్నారనే దానిపై పూస గుచ్చినట్లు తన వీడియోల ద్వారా చైతన్యవంతం చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం యూట్యూబ్ లో మోస్ట్ పాపులర్ గా మారాడు. కోట్లాది మంది ధ్రువ్ రాఠీని చూస్తున్నారు. ప్రభావితం అవుతున్నారు. లక్షలాది మంది ఆయనకు అభిమానులుగా మారి పోయారు.
ఇవాళ దేశంలో ప్రతిపక్షాలు పోషించాల్సిన పాత్రను ధ్రువ్ రాఠీ పోషిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ ఇతడిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ధ్రువ్ రాఠీని ప్రశంసిస్తూనే మీ శక్తిని దేశం కోసం ఉపయోగిస్తే మంచిదని సూచించారు.