NEWSTELANGANA

జూప‌ల్లిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి – కేటీఆర్

Share it with your family & friends

హ‌త్యా రాజ‌కీయాల‌కు ప్రోత్సాహం

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయ‌కుల‌పై దాడులు పెరిగాయ‌ని, ప్ర‌ధానంగా నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా హ‌త్య‌ల‌కు కేరాఫ్ గా మారింద‌ని ఆరోపించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం త‌మ పార్టీ నాయ‌కుడు శ్రీ‌ధ‌ర్ రెడ్డి హ‌త్య‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణమైన హత్యకు ప్రధాన బాధ్యత ఇక్కడ మంత్రి జూపల్లి, కాంగ్రెస్ ప్రభుత్వానిదేన‌ని అన్నారు. తెలంగాణలో గతంలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని తెచ్చి.. నాలుగు నెలల్లోనే కొల్లాపూర్ లో మంత్రి జూపల్లి ప్రోద్భలంతో ఇద్దరు బీఆర్ఎస్ నాయకులపై దారుణమైన హత్యకు తెగబడ్డారని ఆరోపించారు. ఈ హత్యా సంస్కృతిని ప్రోత్సహిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ని వెంటనే బర్తరఫ్ చేయాలి

హత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వేల సంఖ్యలో తరలివెళ్తాం అక్కడి మంత్రులు, నాయకుల ఇండ్లను ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు కేటీఆర్.