మోసం బీజేపీ నైజం – కన్హయ్య
అక్రమాలకు..అవినీతికి కేరాఫ్
న్యూఢిల్లీ – ఈశాన్య ఢిల్లీ ఇండియా కూటమి అభ్యర్థి కన్హయ్య కుమార్ నిప్పులు చెరిగారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
గత 10 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. కేవలం కొద్ది మంది పెట్టుబడిదారులకు మేలు చేకూర్చేందుకే పీఎం నరేంద్ర మోడీ ప్రయత్నం చేశారంటూ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.
కేవలం కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్లు దండుకుంటున్న ప్రధాని మోడీకి ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల కిందట పేదవాడని చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన వాడు నేడు ఢిల్లీలో అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడని సంచలన ఆరోపించారు కన్హయ్య కుమార్.