పదవీ విరమణ నాకు వర్తించదు
2047 వరకు నేనే ప్రధానమంత్రి
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీలో ఎవరైనా , ఎంతటి పెద్ద నాయకుడైనా సరే 75 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించాలని ఇప్పటికే పార్టీ తీర్మానం చేసింది. ఈ మేరకు అద్వానీ, జోషి, తదితర దిగ్గజ నేతలంతా పదవీ విరమణ ప్రకటించారు. ప్రస్తుతం అద్వానీ భారత రత్న పురస్కారంతో సంతోషంగా ఉన్నారు. ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. అడపా దడపా తన అభిప్రాయాలను మాత్రమే పంచుకుంటున్నారు.
తాజాగా ఆప్ చీఫ్, సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాదితో మోడీకి 75 ఏళ్లు పూర్తవుతాయని ఇక ఆయన పీఎంగా ఉండడంటూ బాంబు పేల్చారు. దీనిపై బీజేపీలో చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా విపక్షాలు పదే పదే తన పదవీ విరమణపై చేస్తున్న ప్రకటనపై స్పందించారు మోడీ.
తాను 2047 వరకు ప్రధాన మంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. మిగతా వారికి మాత్రమే రిటైర్మెంట్ వయసు వర్తిస్తుందని తనకు మాత్రం కాదన్నారు ప్రధానమంత్రి. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. మాట తప్పడంలో మోడీని మించిన నాయకుడు లేడని పేర్కొంటున్నారు.