చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
వైసీపీ నేత విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – వైసీపీ లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థి విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఇంకొన్ని రోజులు ఆగితే తన బండారం మొత్తం బయట పడుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు విజయ సాయి రెడ్డి.
పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్లో) నీకు వచ్చింది 23 స్థానాలేనని గుర్తు చేశారు. ఈసారి తమ పార్టీకి చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను కొనుగోలు చేశావంటూ ఆరోపించారు.
పోలింగ్ ముగిసింది..ఇక ఫలితాలు రావడమే మిగిలి ఉందన్నారు విజయ సాయి రెడ్డి. జూన్ 4న అంతిమ ఫలితాలు రానున్నాయని, వైసీపీకి భారీ ఎత్తున సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు .ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ అంటూ ఎద్దేవా చేశారు. ఈ లెక్కన నువ్వు కేవలం నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావంటూ జోష్యం చెప్పారు.