కాంగ్రెస్ రాక కరెంట్ కోత
తన్నీరు హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు మొదలయ్యాయని ఆవేదన చెందారు. హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను నిట్ట నిలువునా మోసం చేశారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పాలనలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేదని కానీ కాంగ్రెస్ వచ్చాక తిరిగి కరెంట్ కష్టాలు మొదలయ్యాయని వాపోయారు. కేవలం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం తప్పితే ఏ ఒక్క గ్యారెంటీ ఇప్పటి వరకు అమలు చేసిన పాపాన పోలేదన్నారు హరీశ్ రావు.
కరెంట్ కోతల కారణంగా వేసుకున్న పంటలకు నీరందడం లేదని తెలిపారు. ఇక రైతు భరోసా ఇస్తానని చెప్పిన సర్కార్ రోజుకో మాట మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. ఇదేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు.
అధికార దర్పంతో అడ్డగోలుగా మాట్లాడటం సీఎంకు అలవాటుగా మారిందన్నారు. తాము ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైన పాత్ర పోషస్తున్నామని చెప్పారు.