ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం
స్వాతి మలివాల్ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ – తనపై శారీరకంగా దాడి జరిగిందని వాపోయిన ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ , ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె ఏఎన్ఐ చీఫ్ స్మితా ప్రకాష్ తో సంభాషించారు. తనకు జరిగిన అవమానం గురించి పూర్తిగా వివరించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను సీఎం ఇంట్లోకి వెళ్లానని, అక్కడ తన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ దాడికి ప్రయత్నం చేశాడని ఆరోపించింది. తప్పించుకునే ప్రయత్నం చేసినా కావాలని తనను కొట్టాడంటూ వాపోయింది స్వాతి మలివాల్.
ఈ సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ఇంట్లోనే ఉన్నాడని, చూస్తూ ఊరుకున్నాడని , ఎలాంటి అడ్డు చెప్పలేదని కన్నీటి పర్యంతం అయ్యింది. బిభవ్ కుమార్ కావాలని తనను డ్యామేజ్ చేశాడని ఆరోపించారు స్వాతి మలివాల్.
తనను రాజీనామా చేయాలని అడిగే హక్కు ఆమ్ ఆద్మీ పార్టీకి, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లేదన్నారు .