దేశంలో కాషాయం రెప రెపలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
పంజాబ్ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి ఢోకా లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లకు పైగా వస్తాయని ధీమా చెందారు. 143 కోట్ల మంది భారతీయులు మూకుమ్మడిగా సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పంజాబ్ లో పర్యటించారు. ఈ సందర్బంగా పాటియాలాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ప్రపంచంలో భారత దేశం డిజిటలైజేషన్ లో ముందంజలో ఉందన్నారు. ఇవాళ ఆర్థిక పరంగా మరింత ముందుకు వెళుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ప్రతి వర్గానికి మేలు చేకూర్చేలా చూశామని అన్నారు మోడీ.
ప్రతిపక్షాలకు అంత సీన్ లేదన్నారు. ముచ్చటగా మూడోసారి పవర్ లోకి రావడం తప్పదన్నారు ప్రధానమంత్రి. వ్యవస్థలను మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయడం జరిగిందని చెప్పారు. రాబోయే కాలమంతా కాషాయానిదేనని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.