అబద్దాలకు మోడీ బ్రాండ్ అంబాసిడర్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కామెంట్స్
న్యూఢిల్లీ – ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అబద్దాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రాండ్ అంబాసిడర్ అంటూ పేర్కొన్నారు. 75 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు బీజేపీలో క్రియా శీలక రాజకీయాల నుండి తప్పు కోవాలని తీర్మానం కూడా చేశారని వెల్లడించారు.
ఓ జాతీయ మీడియా ఛానల్ తో అరవింద్ కేజ్రీవాల్ సంభాషించారు. రిటైర్మెంట్ విషయంలో మిగతా నేతలకు వర్తిస్తుందని కానీ నరేంద్ర మోడీకి ఈ రూల్ వర్కవుట్ కాదని పేర్కొన్నారు. ఆయన ఇప్పటి వరకు గత 10 ఏళ్ల పాలనా కాలంలో ఒక్కటన్నా చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్.
ఇదిలా ఉండగా ఇదే రూల్ ను యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను బయటకు పంపించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కుట్రకు తెర తీసింది ఎవరో కాదు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ షా కూడా ఉన్నారంటూ బాంబు పేల్చారు.
ఈ విషయంలో యోగి కూడా తనను తప్పిస్తారని భావిస్తున్నారని, ఈ విషయాన్ని స్వయంగా గోరఖ్ నాథ్ పీఠం పూజారి కూడా చెప్పారని తెలిపారు సీఎం.