మోదీపై భగ్గుమన్న రౌత్
పీఎంకు అంత సీన్ లేదు
మరాఠా – శివసేన యూబీటీ రాజ్యసభ సభ్యుడు , ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. మోడీ పదే పదే ప్రతిపక్షాల గురించి కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు సంజయ్ రౌత్.
మోడీ ఈ దేశం కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లుగా ఆయన పీఎంగా ఉన్నారని, ఏ ఒక్కటైనా మంచి పని చేశారా అని ప్రశ్నించారు. పదే పదే సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లకు పైగా వస్తాయని చెప్పడాన్ని తప్పు పట్టారు. ఇదంతా జనాన్ని మరోసారి మోసం చేసేందుకు తప్పా ఇంకోటి కాదన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగి పోయిందని దీనికి ప్రధాన కారకుడు నరేంద్ర మోడీనేనని ఆరోపించారు సంజయ్ రౌత్. ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి అత్యధిక స్థానాలు రావడం తప్పదన్నారు.
ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని , మోడీ దానిని చూసి తట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.