ENTERTAINMENT

కోర్టులో తేల్చుకుంటా – శ్రీ‌కాంత్

Share it with your family & friends

నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ‌తా

హైద‌రాబాద్ – బెంగ‌ళూరు రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు శ్రీ‌కాంత్ మేఖా. త‌న‌పై గ‌త కొన్ని రోజులుగా నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ ఆరోపించారు. తాను ఇప్ప‌టికే వీడియో సందేశం ద్వారా చెప్పాన‌ని తెలిపారు శ్రీ‌కాంత్ .

శుక్ర‌వారం ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చారు. తాను డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వం అని చెప్పారు. త‌న‌పై బుర‌ద చ‌ల్లాల‌ని చూస్తే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు న‌టుడు. త‌న పేరు మీడియాలో వ‌చ్చిన ముందు రోజే త‌న అభిప్రాయాన్ని చెప్పాన‌ని తెలిపారు శ్రీ‌కాంత్ మేఖా.

ఒక‌వేళ త‌న పేరును బెంగ‌ళూరు పోలీసులు చెప్పినా వాళ్ల‌కు కూడా తాను నోటీసులు ఇస్తాన‌ని హెచ్చ‌రించారు. శ్రీ‌కాంత్ అంటేనే ఫ్యామిలీ మ్యాన్ అని , త‌న‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. వీలైతే తాను కోర్టుకు వెళ‌తాన‌ని , చూసుకుంటాన‌ని హెచ్చ‌రించారు.

ఒక‌వేళ రేవ్ పార్టీలో తాను ఉన్నాన‌ని నిరూపిస్తే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా తాను భ‌రించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు న‌టుడు శ్రీ‌కాంత్. ఒక‌వేళ ఎవ‌రైనా ఉంటే వారిని వ‌దిలి పెట్ట‌వ‌ద్ద‌ని కోరారు.