రెడ్ బస్ ఫౌండర్ కు థ్యాంక్స్
గెలిపిస్తే ప్రజా సేవ చేస్తా
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, వరంగల్ – ఖమ్మం – నల్లగొండ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో నిలిచిన రాకేశ్ రెడ్డి అనుగులకు రోజు రోజుకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. జై భారత్ పార్టీ వ్యవస్థాపకుడు , మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ సైతం రాశేఖ్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.
ఇదిలా ఉండగా తాజాగా రెడ్ బస్ వ్యవస్థాపకుడు సామ ఫణిందర్ రెడ్డి సైతం రాశేశ్ రెడ్డికి సపోర్ట్ చేయాలని కోరారు. దీనిపై ఇవాళ స్పందించారు. తనకు బేషరతుగా మద్దతు తెలియ చేసినందుకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని స్పష్టం చేశారు.
రెడ్ బస్ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించిన చరిత్ర ఫణిందర్ రెడ్డికి ఉందన్నారు. అందరూ ఆశించినట్టు, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిపిస్తే పని చేస్తానని స్పష్టం చేశారు అనుగుల రాకేశ్ రెడ్డి.
ఈ నెల 27 జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ – 3 పై గల నా పేరు ఏనుగుల రాకేష్ రెడ్డి కి ఎదురుగా (1) మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.