SPORTS

స్పిన్న‌ర్ల ప్ర‌తాపం రాజ‌స్థాన్ ప‌రాజ‌యం

Share it with your family & friends

ఐపీఎల్ 2024లో ఫైన‌ల్ కు చేరిన హైద్రాబాద్

చెన్నై – ఐపీఎల్ 2024లో భాగంగా జ‌రిగిన కీల‌క‌మైన పోరులో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ దుమ్ము రేపింది. బౌల‌ర్ల దెబ్బ‌కు రాజ‌స్థాన్ కుప్ప కూలింది. బ్యాట‌ర్లు ప‌రుగులు చేయ‌లేక చేతులెత్తేసింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో స్పిన్న‌ర్లు తిప్పేశారు. టార్గెట్ త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ ఛేద‌న‌లో ప‌క్క‌దారి ప‌ట్టారు. క్వాలిఫ‌య‌ర్ -2లో రాజ‌స్థాన్ ను ఓడించి ఫైన‌ల్ కు ద‌ర్జాగా చేరింది హైద‌రాబాద్.

ప్ర‌ధానంగా షాబాజ్ , అభిషేక్ శ‌ర్మ అద్భుత‌మైన బౌలింగ్ దెబ్బ‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విల విల లాడింది.
ఓ ద‌శ‌లో వికెట్లు కోల్పోయినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టులో క్లాసెన్ తో పాటు రాహుల్ త్రిపాఠి సూప‌ర్ గా ఆడారు.

17వ ఐపీఎల్ సీజ‌న్ లో ఆది నుంచీ ప్ర‌త్య‌ర్థుల జ‌ట్టుల‌కు చుక్క‌లు చూపిస్తూ దుమ్ము రేపింది . ఈనెల 26న ఆదివారం కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగే ఫైన‌ల్ పోరుకు సిద్దం కానుంది స‌న్ రైజ‌ర్స్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో.

షాబాజ్ అహ్మ‌ద్ 23 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చితే అభిషేక్ శ‌ర్మ 24 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. 176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజస్థాన్ ఆశించిన మేర రాణించ లేక పోయింది. 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 139 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

జ‌ట్టులో ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్క‌డా త‌డ‌బాటుకు లోను కాకుండా ధ్రువ్ జురైల్ ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. 35 బంతులు ఎదుర్కొని 56 ప‌రుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇందులో 7 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి.

.అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ జ‌ట్టులో క్లాసెన్ 34 బాల్స్ ఎదుర్కొని 4 సిక్స‌ర్ల‌తో 50 ర‌న్స్ చేశాడు. ఇక రాహుల్ త్రిపాఠి 15 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 37 ర‌న్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి.

రాజ‌స్థాన్ జ‌ట్టును కుప్ప కూల్చిన షాబాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.