ఏపీలోనే అత్యధిక పెన్షన్లు
హోం శాఖ మంత్రి తానేటి వనిత
కొవ్వూరు – దేశంలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత. ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు ఠంఛనుగా స్వయంగా అందజేసే పద్దతి ఎక్కడా లేదన్నారు.
పెన్షన్ దారులు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. సోమవారం కొవ్వూరులోని దొమ్మేరు గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. రూరల్ మండలంలో ఇప్పటి దాకా పెన్షన్ల ఖర్చు మొత్తం 3 కోట్ల 99 వేలకు పెరిగిందన్నారు.
కొవ్వూరు నియోజకవర్గంలో ఈ ఒక్క నెలలోనే 620 మందికి నూతన పెన్షన్లు అందజేశామన్నారు. చాగల్లు మండలంలో 126 మందికి, తాళ్లపూడి మండలంలో 189 మందికి, కోవ్వూరు టౌన్ లో 85 మందికి, కొవ్వూరు రూరల్ మండలంలో 220 మందికి నూతన పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు.
వృద్దులతో పాటు వితంతువులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు నెలనెలా ఇచ్చే పెన్షన్ మొత్తం మూడు వేల రూపాయాలకు జగనన్న ప్రభుత్వం పెంచిందని అన్నారు తానేటి వనిత. గత ప్రభుత్వంలో లబ్దిదారులను పట్టించు కోలేదని ఆరోపించారు. కానీ తాము వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.