తిప్పేసిన షాబాజ్ అహ్మద్
రాజస్థాన్ రాయల్స్ కు షాక్
చెన్నై – ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో ఆద్యంతమూ ఆధిపత్యాన్ని ప్రదర్శించి సన్ రైజర్స్ హైదరాబాద్ . ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 176 రన్స్ చేసింది.
అనంతరం టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏ కోశాన పోరాటం చేయలేక పోయింది. తొలి సెషన్ లో దుమ్ము రేపిన రాజస్థాన్ ఆశించిన మేర ఆడ లేక పోయింది. చివరకు పరుగులు చేయలేక చేతులెత్తేసింది.
ప్రధానమైన ఆటగాళ్లంతా పెవిలియన్ బాట పట్టారు. రన్స్ చేయలేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. సన్ రైజర్స్ జట్టుకు చెందిన స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్ , అభిషేక్ శర్మ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు సంజూ శాంసన్, రియాన్ పరాగ్, సిమ్రాన్ హిట్ మెయిర్ , రోమన్ పావెల్ , రవిచంద్రన్ అశ్విన్.
షాబాజ్ అహ్మద్ స్పిన్ మాయ జాలానికి చతికిల పడ్డారు. కేవలం 24 రన్స్ మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.